కుటుంబ కలహాలే కారణమా?

ABN , First Publish Date - 2020-11-28T03:18:48+05:30 IST

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కు కుటుంబ కలహాలే కారణమా? భార్యాభర్తలు గొడవ పడడంతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసి, తాను దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం హస్నాబాద్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

కుటుంబ కలహాలే కారణమా?

తల్లీ పిల్లల ఆత్మహత్యపై హస్నాబాద్‌లో కలకలం

మద్దూరు మండలం కొమ్మూరులోనూ విషాదం


మద్దూర్‌, నవంబరు 27: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కు కుటుంబ కలహాలే కారణమా? భార్యాభర్తలు గొడవ పడడంతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసి, తాను దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం హస్నాబాద్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మద్దూర్‌ మండలం కొమ్మూర్‌ గ్రామానికి చెందిన సత్యప్ప, ఎల్లమ్మ(26) భార్యాభర్తలు. వీరికి రజిత (8), అనిత, రాజు (4) ముగ్గురు సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఉదయం భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలు రాజు, రజిత, అనితతో కలిసి కొడంగల్‌ మండలం హస్నాబాద్‌కు ఆటోలో వచ్చింది. ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు చెరువు దగ్గరికి చేరుకొని పిల్లలందరికి చున్నీతో చేతులు కట్టేసి తను కూడా చెరువులో దూకి ఆత్మయత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో అనిత అనే అమ్మాయి ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. కానీ, ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో మృతి చెందారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల వారిని కలచి వేసింది. ముక్కుపచ్చలారని చిన్నారి అనిత ఘటన జరిగిన వివరాలను తెలుపుతూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఈ సంఘటనలో తప్పించుకున్న చిన్నారితో విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు చెరువు దగ్గరికి చేరుకొని పరిశీలించారు. అందులో కొంత మంది చెరువులో దిగి గాలించగా ఎల్లమ్మ మృతదేహం బయటపడగా చిన్నారుల మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనతో అటు కొమ్మూర్‌, ఇటు హస్నాబాద్‌ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read more