మహదానందం.. ఉద్దాలోత్సవం

ABN , First Publish Date - 2020-11-22T03:59:51+05:30 IST

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి ఉద్దా లోత్సవం కన్నుల పండువగా సాగింది.

మహదానందం.. ఉద్దాలోత్సవం
కురుమూర్తి జాతర మైదానంలో ఉద్దాలోత్సవానికి తరలి వచ్చిన భక్తులు

- గోవింద నామ స్మరణతో మార్మోగిన కురుమూర్తి కొండలు 

- భారీగా తరలి వచ్చిన భక్తులు

- ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు  

- కనుల పండువగా సాగిన ఉద్దాల ఊరేగింపు


చిన్నచింతకుంట, నవంబరు 21 : కురుమూర్తి వేంకటేశ్వర స్వామి ఉద్దా లోత్సవం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఈ వేడుకకు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కొవిడ్‌-19 నిబంఽ దనల మేరకు భక్తులు పరిమిత సంఖ్యలో రావాలని ముందుగానే అధికారు లు సూచనలు చేసినా, భక్తులు మాత్రం అధిక సంఖ్యలో తరలి వచ్చారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి గ్రామం నుంచి శనివారం ఉదయం ఉద్దాలను తీసుకెళ్లేందుకు తయారు చేసిన చాట ను ఆలయ ఈఓ శ్రీనివాసులు, చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్న వడ్డె మాన్‌లోని ఉద్దాల తయారీ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ 11 గంటలకు ఉద్దాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దే వరదక్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఉద్దాల ఊరేగింపు ఊకచెట్టువాగు వద్దకు చేరింది. అక్కడి నుంచి తిర్మలా పూర్‌ మీదుగా దేవుని చెరువు, దశమి కట్ట వద్దకు మధ్యాహ్నం చేరింది. అ నంతరం కురుమూర్తి జాతర మైదానంలోకి తీసుకొచ్చారు.


ఈ సందర్భంగా భక్తులు ఉద్దాలను దర్శించుకున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో పాటు జ డ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సువర్ణరాజు, ఎం పీడీఓ శ్రీనివాసులు, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ వట్టెం రాజేశ్వరి ఉద్దా లకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు కురుమూర్తి వేంకటేశ్వర స్వామికి దాసంగాలు సమర్పించారు.



Updated Date - 2020-11-22T03:59:51+05:30 IST