ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-11-27T04:22:11+05:30 IST
మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసి న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిసాయి.

చిన్నచింతకుంట, నవంబరు 26 : మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసి న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిసాయి. ఉదయం స్వా మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఆభరణాలను తొలగించారు. ఆలయ ప్రాంగణంలో వాటిని అధికారుల సమక్షంలో పెట్టెలో భధ్రపరిచి, వాటిని ఆత్మకూ ర్ ఎస్‌బీఐ బ్యాంకుకు తరలించారు. కాగా, ఈనెల 14 నుంచి ప్రారంభమైన జాతరలో 19న అలంకారోత్సవం, 21న ఉద్దాలోత్సవం జరిగింది. ఒక్క ఉద్దాలోత్సవం రోజే దాదాపు లక్ష న్నర దాకా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, చైర్మన్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.