కుమ్మెర గట్టు.. జనసంద్రం
ABN , First Publish Date - 2020-02-24T10:52:51+05:30 IST
మండలంలోని కుమ్మెర గట్టు జనసంద్రంగా మారింది. ప్రతి అమావాస్యకు భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా
కందనూలు, ఫిబ్రవరి 23 : మండలంలోని కుమ్మెర గట్టు జనసంద్రంగా మారింది. ప్రతి అమావాస్యకు భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా జాతర సందర్భంగా ఆదివారం అమావాస్య కావడంతో కుమ్మెర గట్టు మల్లన్నకు భక్తులు ఎడ్ల బండ్లలో ఊరేగింపుగా వచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీ ర్చుకున్నారు. బిజినెపల్లి, తాడూర్, తిమ్మాజి పేట, నాగర్‌కర్నూల్ మం డలాలలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తు లు స్వామి వారిని దర్శిం చుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ నుం చి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీదేవి ఏర్పాట్లు చేశారు. అంతకుముం దు యాదవులచే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.