కృష్ణా జలాలతో సస్యశ్యామలం
ABN , First Publish Date - 2020-12-14T03:14:35+05:30 IST
కృష్ణా జలాల రాకతో నియోజక వర్గంలోని అనేక గ్రామాలు జలకళను సంతరించుకున్నాయ ని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అ న్నారు.

- ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
వంగూరు, డిసెంబరు 13: కృష్ణా జలాల రాకతో నియోజక వర్గంలోని అనేక గ్రామాలు జలకళను సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అ న్నారు. ఆదివారం మండల పరిధిలోని మిట్టసదగోడు పెద్ద చెరువు వద్ద రబీ సీజన్‌కు గాను సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరువు నేలపై కృష్ణా జలాలు పరవ ళ్లు తొక్కుతున్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రా మాల్లోని చెరువులు నేడు నిండు కుండలా తలపిస్తున్నాయన్నారు. దీంతో రబీలోను సాగు విస్తీర్ణం పెరుగుతోందన్నారు. సాగు నీటిని ఆయకట్ట రైతులు సద్దినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ తిర్పతయ్యయాదవ్, తహసీల్దార్ రాజునాయక్, ప్రవీణ్‌రెడ్డి, సాదిక్, కృష్ణారెడ్డి, లాలుయాదవ్, శ్రీను, అంకుసరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి బస్తీ బాటకు శ్రీకారం
అచ్చంపేట: అచ్చంపేట పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో అన్ని వార్డులలో ఉన్న సమస్యల పరిష్కారానికి బస్తీ బాటకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెనకబడిన నల్లమల ప్రాంతంలో అనేక మంది నిరుపేదలు ఉంటే జిల్లాలోనే ఏకైక 100 పడకల హాస్పిటల్‌గా మంజూరు చేయించి నిర్మాణం జరుగుతుంటే దానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. మునిసిపాలిటీలో విలీనం అయిన 8 గ్రామపంచాయతీలను యఽథావిధిగా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామన్నారు. అభివృద్ధి విషయంలో అచ్చంపేట అన్ని రంగాల్లో ముందుకు పోవాలని అన్ని విధాల అభివృద్ధి జరగాలని దానికి పార్టీకి ప్రతి ఒక్కరు సహకరించి పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, మునిసిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ బంధం రాజు, నాయకులు నర్శింహ గౌడ్, రాజేందర్,వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.