గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలి

ABN , First Publish Date - 2020-09-12T10:33:41+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తూ స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ..

గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలి

శాసనసభలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి 


కోస్గి, సెప్టెంబరు 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తూ స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత భవనాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యేలకు పదిశాతం కోటా కేటాయించాలని కోరారు. మంత్రికొప్పుల ఈశ్వర్‌సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-09-12T10:33:41+05:30 IST