వాల్మీకుల రిజర్వేషన్‌కు కేసీఆర్‌ సిద్దం: ఎమ్మెల్యే అబ్రహాం

ABN , First Publish Date - 2020-09-06T09:52:25+05:30 IST

వాల్మీకుల రిజర్వేషన్‌కు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని, వారి న్యాయమైన కోరికను గుర్తించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు...

వాల్మీకుల రిజర్వేషన్‌కు కేసీఆర్‌ సిద్దం: ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌, సెప్టెంబరు 5; వాల్మీకుల రిజర్వేషన్‌కు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని, వారి న్యాయమైన కోరికను గుర్తించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.  వాల్మీకులు తరలివెళ్లి క్యాంపు కార్యాలయంలో శనివారం  ఎమ్మెల్యేను కలసి తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని,  తమ వాణిని అసెంబ్లీలో వినిపించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మీ డిమాండ్లను  ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేశారని గర్తుచేశారు. వాల్మీకి నాయకులు మద్దిలేటి,  రాములు, జగన్‌మోహన్‌నాయుడు, రమేష్‌, ధనుంజయ, పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T09:52:25+05:30 IST