కర్నాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-26T03:01:55+05:30 IST

కర్నాటకకు చెందిన మద్యం అక్రమంగా తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

కర్నాటక మద్యం పట్టివేత
పట్టుబడిన కర్నాటక మద్యంతో ఎస్సై శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది

రాజోలి, నవంబరు 25: కర్నాటకకు చెందిన మద్యం అక్రమంగా తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌  తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం తెల్లవారు జామున పక్కా సమాచారంతో రాజోలి మండలంలోని తుమ్మిళ్ల గ్రామంకు కర్నాటక చెందిన మద్యం వస్తుందని తెలుసుకుని, తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు.  ఒక ఆటో,  50కాటన్ల మద్యం,  బోయకృష్ణ, కృష్ణ గౌడు, అరవింద్‌ గౌడు అనే వ్యక్తు లను  పట్టుకున్నట్లు తెలిపారు. ఒక్కో కాటన్‌లో 96 బాటిల్స్‌ చొప్పున మొత్తం 4,800 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారితో పాటు తుమ్మిళ్లకు చెందిన మునిస్వామి, చిన్న పరశురాముడు, చిన్న నాగరాజు, బోయ వెంకటేష్‌ కలిసి ఈ మద్యాన్ని అక్రమంగా తుంగభద్ర నది నుంచి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు  తరలిస్తుండగా పట్టుకొని వారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.  ఈ మద్యం విలువ రూ. 1.92లక్షలు ఉంటుందని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

  కల్లు దుకాణాలపై దాడి

గద్వాల క్రైం: కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ తెలిపారు.  ధరూర్‌ మండలంలోని ఉప్పేరులో వెలిసిన  కల్లు దుకాణాల మీద మహబూబ్‌నగర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం దాడులు నిర్వహించి గట్టం శంకర్‌గౌడ్‌, నీరుగంటి భగవంతుగౌడు, వాల్దాస్‌ రాజప్పగౌడ్‌ వేర్వేరుగా నిల్వచేసి విక్రయాలు చేస్తున్న మొత్తం 492లీటర్ల కల్లును ధ్వంసం చేశారు. ఆ ముగ్గురిని గద్వాల స్టేషన్‌లో అప్పగించగా కేసు నమోదు చేశామన్నారు.  

Read more