కనకదాసు అడుగుజాడల్లో నడవాలి
ABN , First Publish Date - 2020-12-04T04:37:10+05:30 IST
భక్త కనకదాసు గొప్ప వ్యక్తి అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవా లని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
కేటీదొడ్డి, డిసెంబరు 3: భక్త కనకదాసు గొప్ప వ్యక్తి అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవా లని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని చింతలకుంట గ్రామంలో గురువారం నిర్వహించిన కనకదాసు జయంతి వేడు కల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సభ్యుడు రాజ శేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు ఉన్నారు.
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు జరిపించారు. ఆమె వెంట నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రా ములు, రామాంజనేయులు, వెంకటేశ్వర్‌రెడ్డి, మహా దేవ్ ఉన్నారు.
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ ఉత్సవాల్లో పాల్గొని భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆయన వెంట బుచ్చిబాబు, లవన్న, రామకృష్ణ ఉన్నారు.
- మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో కురువ కులస్తులు ఆధ్వర్యంలో భక్త కనకదాసు జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం లో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు, విష్ణు, ఉరుకుందు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
గద్వాల టౌన్ : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గద్వాల పట్టణంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. దివ్యాంగులకు తనవంతుగా అన్ని విధాల తోడ్పాటును అందిస్తామన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మల్దకల్ : మండలంలోని సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.36 వేల చెక్కును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి, ప్రతాప్‌గౌడ్, సర్పంచు వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.