చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం

ABN , First Publish Date - 2020-07-08T11:22:39+05:30 IST

కేఎల్‌ఐ డి- 82ను పూర్తి చేయించి చివరి ఆయకట్టు వర కు సాగునీరు అంది స్తామని కల్వకుర్తి ఎ మ్మెల్యే జైపాల్‌ యాద వ్‌ తెలిపారు.

చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం

కేఎల్‌ఐ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష 


కల్వకుర్తి అర్బన్‌, జూలై 7: కేఎల్‌ఐ డి- 82ను పూర్తి చేయించి చివరి ఆయకట్టు వర కు సాగునీరు అంది స్తామని కల్వకుర్తి ఎ మ్మెల్యే జైపాల్‌ యాద వ్‌ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కేఎల్‌ఐ - 29వ ప్యాకేజీ, డి-82లపై  అఽధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు. కేఎల్‌ఐ జల సాధన సమితి సభ్యులు కేఎల్‌ఐ పూర్తి కోసం తమకు వినతి పత్రం అందజేశారని, ఈ విషయంపై మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. డి-82కు పెండింగ్‌ బిల్లులు, రైతులకు నష్ట పరిహారం రూ. 50 కోట్లు ఉందని, వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతామన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీకాంత్‌, డిప్యూటీ ఈఈలు దేవన్న, షర్మిల, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-08T11:22:39+05:30 IST