జూరాల ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2020-07-19T07:22:43+05:30 IST

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు..

జూరాల ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల

గద్వాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు 84 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏడు గేట్లను ఎత్తి 29,148 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్‌ కేంద్రానికి 37,845 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నెట్టంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా-1కు 650, కోయిల్‌సాగర్‌కు 630, ఎడుమ కాల్వకు 650, కుడి కాల్వకు 391, సమాంతర కాల్వకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 66,993 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టుకు 36,186 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 46,130 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 43,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 45,995 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది.

Updated Date - 2020-07-19T07:22:43+05:30 IST