జూరాల ప్రాజెక్ట్‌లోకి క్రమంగా పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-13T13:58:44+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

జూరాల ప్రాజెక్ట్‌లోకి క్రమంగా పెరుగుతున్న వరద

మహబూబ్‌నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి 318.516 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 317.920 మీటర్లకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 8.454 టీఎంసీలుగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,65,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,61,475 క్యూసెక్కులుగా ఉంది. 


Updated Date - 2020-10-13T13:58:44+05:30 IST