జర్నలిస్టులకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించాలి

ABN , First Publish Date - 2020-05-09T10:01:15+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి జర్నలిస్టుకు రూ.10వేలు అందించాలని తెలంగాణ

జర్నలిస్టులకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 8 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి జర్నలిస్టుకు రూ.10వేలు అందించాలని తెలంగాణ సామాజిక జర్నలిస్టు ఫోరం నాయకుడు వంగూరి జయశంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల ఆవరణలో ఆయన ఒకరోజు మౌన దీక్ష చేపట్టారు. శిబిరాన్ని సీనియర్‌ జర్నలిస్టులు మహ్మద్‌ అబ్దుల్లాఖాన్‌, కందికొండ మోహన్‌, కిశోర్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో శివ, కరుణాకర్‌, పరుశురాములు, శ్యాంసుందర్‌, దస్తగిరి, విజయ్‌, రాము, గోపి, మిద్దె మల్లేశ్‌, చంటి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T10:01:15+05:30 IST