జోగుళాంబ ఆలయ ట్రస్టీల నియామకంపై పిల్
ABN , First Publish Date - 2020-12-04T04:51:07+05:30 IST
అలంపూర్ జోగుళాంబ ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులను స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించింది.

హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అలంపూర్ జోగుళాంబ ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులను స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ట్రస్టు సభ్యుల నియామకానికి సిఫార్సు చేసిన స్థానిక ఎమ్మెల్యే అబ్రహంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.