జములమ్మ హుండీ ఆదాయం రూ.20,24,626

ABN , First Publish Date - 2020-03-12T05:41:00+05:30 IST

జములమ్మ దేవాలయ హుండీ ఆదాయం రూ.20,24,626 వచ్చినట్లు ఈఓ వీరేశం తెలిపారు. భక్తుల సమక్షంలో ఎండోమెంటు

జములమ్మ హుండీ ఆదాయం రూ.20,24,626

గద్వాల రూరల్‌, మార్చి 11 : జములమ్మ దేవాలయ హుండీ ఆదాయం రూ.20,24,626 వచ్చినట్లు ఈఓ వీరేశం తెలిపారు. భక్తుల సమక్షంలో ఎండోమెంటు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరమ్మ, ఆలయ మాజీ చైర్మన్‌ శ్రీరాములు హుండీలను ఒక్కొక్కటిగా తెరిచి, బ్యాంకు, ఆలయ సిబ్బంది నగదును లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. గత ఏడాది రూ.12,66,659 ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే ఈ సారి రూ.7.57లక్షలు అధికంగా వచ్చాయి. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు గుర్రంగడ్డ భాస్కర్‌రెడ్డి, వినోదాచారి, ఆలయ సిబ్బంది మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్‌, సురేష్‌, మద్దిలేటి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కరోనా భయం

దాదాపు రెండు నెలలు సాగిన జములమ్మ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో జములమ్మ హుండీని లెక్కించే సమయంలో జాగ్రత్తలను పాటించారు. అధికారులు, సిబ్బంది మాస్కులను ధరించారు. లెక్కింపు పూర్తయ్యాక శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్నారు. 

Updated Date - 2020-03-12T05:41:00+05:30 IST