నయా దందా

ABN , First Publish Date - 2020-08-20T11:27:40+05:30 IST

అక్రమార్కులు కొత్త దందాకు తెరలేపారు. నాటుసారా కోసం వినియోగించే బెల్లంను అక్రమంగా రవాణా చేస్తున్నారు

నయా దందా

జోగుళాంబ గద్వాల నుంచి బెల్లం అక్రమ రవాణా

దాడులు అధికం కావడంతో రాయచూర్‌కు మారిన అడ్డ


గద్వాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : అక్రమార్కులు కొత్త దందాకు తెరలేపారు. నాటుసారా కోసం వినియోగించే బెల్లంను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాలకు జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దుగా ఉండటంతో, యథేచ్ఛగా తమ దందాను సాగిస్తున్నారు. 


నిన్ని మొన్నటి వరకు గద్వాల నుంచి బెల్లాన్ని వనపర్తి జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండేంది. కానీ, గద్వాలలో బెల్లం నిల్వలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించడంతో అక్రమ వ్యాపారులు తమ అడ్డాను కర్ణాటకలోని రాయచూరుకు మార్చారు. అక్కడి నుంచే బెల్లాన్ని తీసుకు వెలుతున్నారు. ఇటీవల పంద్రాగస్టు రోజున జిల్లా కేంద్రంలో భారీగా బెల్లం పట్టుబడింది. పట్టుబడిన బెల్లం వాహనాలపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మాత్రం ఎలాంటి బెయిల్‌ లేకుండా ఆబ్కారీ అధికారులు విడిచి పెట్టారు. కేసును ఉపసంహరించుకోవాలని కొందరు, ఎదో మాట్లాడి కేసును ఖతం చేయండి అంటు మరికొందరు రాయబారాలు చేస్తున్నారు. 


ధర రెండింతలు

గద్వాలలో బెల్లం కిలో రూ.40 పలుకుతోంది. అదే వనపర్తి ఏరియాలో రూ.వంద పలుకుంటుంది. దీనికి కారణం ఎక్కువగా బెల్లంతో నాటుసారా తయారు చేస్తున్నారు. గద్వాల ఆబ్కారీ సీఐ గోపాల్‌ 1,200 వందల క్వింటాళ్ల బెల్లాన్ని ఇప్పటి వరకు పట్టుకున్నారు. 32 కేసుల, 62 మందిపై కేసులు పెట్టారు. ఇటీవల పట్టుకున్న బెల్లం వాహనాన్ని విచిడి పెట్టాలని చాలా మంది నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-08-20T11:27:40+05:30 IST