-
-
Home » Telangana » Mahbubnagar » Irrigation Story
-
‘రాఘవేంద్ర’ రక్షించు!
ABN , First Publish Date - 2020-12-07T04:03:23+05:30 IST
రెండున్నర దశాబ్దాలుగా వందల ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకం కనుమ రుగు కానున్నది.

- హైవే నిర్మాణంతో గురు రాఘవేంద్ర ఎత్తిపోతలకు గండం
- 700 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
గద్వాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రెండున్నర దశాబ్దాలుగా వందల ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకం కనుమ రుగు కానున్నది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కాలగర్భంలో కలిసిపోనున్నది. మహారాష్ట్ర అక్కల్‌కోట్ నుంచి కర్ణాటక, తెలంగాణ మీ దుగా ముంబై-చెన్నై వరకు నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా జో గుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ రహదారి వెళ్లనున్నది. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని రాయచూరు మీదుగా జి ల్లాలోని కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మీదుగా క ర్నూల్ వద్ద జాతీయ రహదారి 44పై కలుస్తుంది. ఈ రహదారి కోసం ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామం లో ఉన్న గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ముంపునకు గురి కానున్నది. దీంతో పథకం పరిధిలోని ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
రెండు పంటలకు నీరు
వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామంలో 1995లో తుంగభద్ర నది ఆధారంగా శ్రీ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. మూ డు 30 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పంపులను ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పథకం పరిధిలోని బుడమొర్సు, గార్లపాడు, గాంధీనగర్ గ్రామాల్లోని దాదాపు 700 ఎకరాలకు రెండు పంటలకు సా గునీరు అందుతుంది.
సర్వేలతో గుబులు..
అక్కల్‌కోట్ నుంచి చెన్నైకి వెళ్తున్న హైవే ఆరు లైన్లతో నిర్మించడానికి ఇటీవల సర్వేలు జరిగాయి. 264 ఫీట్ల వేడల్పుతో నిర్మాణం జరిగే ఈ రోడ్డు దాదాపు 278 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగనుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం రెండు వైపుల 40 మీటర్ల చొప్పున సర్వేలు నిర్వహించి మార్కింగ్ వేయగా, ఇందులో పొలాలతో పాటు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం కూడా పోతుందని ప్రచారం జరుగుతోంది.
