పాత సామగ్రి.. స్వాహా

ABN , First Publish Date - 2020-12-04T03:52:57+05:30 IST

నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవ ర్గంలో కృష్ణానది తీరం వెంట దశాబ్దాల కిందట సాగునీ టి సదుపాయం కల్పించే నిమిత్తం కృష్ణా మండలం ము రారిదొడ్డి, తంగిడిగి, కృష్ణ, గుడేబల్లూరు, మాగనూరు మండ లం పుంజూనూరు, కొల్లూరులలో మినీ ఎత్తిపోతల పథకాల ను నిర్మించారు.

పాత సామగ్రి.. స్వాహా
మురారిదొడ్డి పథకం వద్ద బయటే ఉన్న ఇనుము సామగ్రి

- మినీ ఎత్తిపోతల పథకాల పాత సామగ్రిపై అక్రమార్కుల కన్ను

- రూ.3 కోట్ల సామగ్రిని దొడ్డిదారిన కాజేసే ప్రయత్నాలు

- మక్తల్‌ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలు

- రాయచూరు వ్యాపారులకు అమ్మే ప్రయత్నం

- మురారిదొడ్డి సామగ్రి తరలింపుతో బట్టబయలైన వ్యవహారం

- వేలం పాట వేసి అమ్మాలంటున్న ప్రతిపక్షాలు, రైతులు

- నాయకుల అండదండలున్నట్లు ఆరోపణలు


మినీ ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ తర్వాత మిగిలిన విలువైన సామగ్రిపై అక్రమార్కుల కన్ను పడింది.. కీలక నాయకుల ఆశీస్సులు, చోటా నాయకుల అండదండలతో ఈ ముఠా, దొడ్డిదారిన కోట్ల విలువజేసే సామగ్రిని తరలించేందుకు సిద్ధమైంది.. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణానది తీరం వెంబడి ఉన్న మినీ ఎత్తిపోతల పథకాలు కేంద్రంగా ఈ దందాకు తెరలేపింది.. ఇటీవల కృష్ణా మండలం మురారిదొడ్డి ఎత్తిపోతల వద్ద అక్రమంగా లిఫ్టు సామగ్రిని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని రైతులు అడ్డుకోవడంతో, ఈ వ్యవహారం బయట పడింది.. ఈ ఒక్క ఎత్తిపోతలకు పరిమితం కాకుండా, ఈ నియోజకవర్గంలోని ఆధునికీకరించిన మినీ ఎత్తిపోతల పథకాల వద్ద పేరుకుపోయిన పాత సామగ్రిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది..


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవ ర్గంలో కృష్ణానది తీరం వెంట దశాబ్దాల కిందట సాగునీ టి సదుపాయం కల్పించే నిమిత్తం కృష్ణా మండలం ము రారిదొడ్డి, తంగిడిగి, కృష్ణ, గుడేబల్లూరు, మాగనూరు మండ లం పుంజూనూరు, కొల్లూరులలో మినీ ఎత్తిపోతల పథకాల ను నిర్మించారు. అయితే, ఇక్కడ ఏర్పాటు చేసిన మోటార్లు, పం పులు, పైపులు, ఎలక్ట్రికల్‌ సామగ్రికి కాలం చెల్లడంతో, రెండేళ్ల కిం దట వీటిని ఆధునికీకరించారు. ఆ తర్వాత అక్కడ అప్పటి వరకు విని యోగంలో ఉన్న మోటార్లు, పంపులు, పైపులు, ఇతర ఎలక్ట్రికల్‌ సామగ్రిని పక్కన పడేశారు. రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహించే ఈ పథకాలలో నిల్వ ఉన్న సామగ్రి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుంది. ఆధునికీకరణ తర్వాత ఈ సామగ్రిని విక్రయుంచే అంశంపై ప్రభుత్వం, ఇరిగేషన్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐడీసీ) ఎలాంటి  నిర్ణయం తీసు కోకపోవడంతో అధికారులు వాటిని అక్కడే వదిలేశారు. దీంతో విలువైన ఈ సామగ్రిపై కన్నేసిన చోటా నాయకులు, ఇక్కడి కీలక నేత ఆశీస్సులతో వీటిని అమ్ముకొని సొమ్ముచేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తొలుత మురారిదొడ్డి ఎత్తిపోతల పథకం వద్ద నవంబరు 15న సామగ్రిలో గుట్టుచప్పుడు కాకుండా రూ.15 లక్షల విలువైన వాటిని తరలించారు. ఆ తర్వాత మిగిలిన సామగ్రిని తరలించే ప్రయత్నం చేస్తుండగా, నవంబరు 22న గ్రామ రైతులు అడ్డుకు న్నారు. మక్తల్‌కు చెందిన ఒక పాత ఇనుము వ్యాపారితో పాటు, చోటా నాయకులు ఈ దందాలో కీలకంగా వ్యవ హరిస్తున్న విషయం ఈ సంఘటనతో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఐడీసీ అధికారులు మురారిదొడ్డి పథకం నుంచి సామగ్రిని తరలిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే, ఇంతటితో ఆగని ఈ ముఠా తాజాగా నియోజకవర్గం లోని మిగిలిన లిఫ్టుల్లో ఉన్న పాత సామగ్రిని కూడా రాయచూ రులోని ఒక పాత ఇనుము వ్యాపారికి విక్రయించే నిమిత్తం బే రసారాలు సాగిస్తోంది. నాలుగు రోజుల కిందట రాయచూరుకు చెందిన ఈ వ్యాపారులు, ఈ ముఠాతో కలిసి లిఫ్టులను పరిశీలించి వెళ్లారని స్థానికులు చెబు తున్నారు. రైతుల దృష్టి మరలిన తర్వాత రాత్రి ళ్లు సామగ్రిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నా రని, కీలక నాయకుల ఆశీస్సులు, చోటా నాయ కుల ప్రమేయంతోనే ఈ దందాకు తెరలేపారని ప్రతిపక్షలు, రైతులు ఆరోపిస్తున్నారు. మురారి దొడ్డి లిఫ్టు సామగ్రి తరలిపోయిన తర్వాత ఐ డీసీ అధికారులు మౌనం వహించడంపైనా వి మర్శలు వస్తున్నాయి. దాదాపు రూ.3 కోట్ల వి లువైన పాత సామగ్రిని వేలం పాట నిర్వహిం చి విక్రయించాలని, నిర్లక్ష్యం వహించి జాప్యం చేస్తే సామగ్రిపై కన్నేసిన నాయకులు వాటిని కాజేస్తారని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై అ ధికారులను ప్రశ్నిస్తే, ఐడీసీ అనుమతుల్లేకుం డా వాటిని విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమో దు చేస్తామని చెబుతున్నారు. మురారిదొడ్డి లిఫ్టులో సామగ్రి తరలిన అంశంపై ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు, పోలీసు కేసు నమోదు చేశామని చెబుతున్నారు. లిఫ్టుల వద్ద ఉ న్న పాత సామగ్రి విషయంలో ఉన్నతాధికారుల నిర్ణయం మేర కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-12-04T03:52:57+05:30 IST