వెంకన్న చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
ABN , First Publish Date - 2020-10-28T10:43:27+05:30 IST
మండలంలోని మనిగిళ్ల వెంకన్నచెరువును మంగళవారం ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదముందని గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించడంతో వారు స్పందించారు

పెద్దమందడి, అక్టోబరు 27: మండలంలోని మనిగిళ్ల వెంకన్నచెరువును మంగళవారం ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదముందని గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించడంతో వారు స్పందించారు. చెరువు కట్టపై కంప చెట్ల పెరగడంతో చీమలు, ఎలుకలు రంధ్రాలు చేస్తున్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరలో మరమ్మతులు చేపడుతామన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్ కుమార్, సర్పంచ్ సరిత తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.