బాలికలదే హవా

ABN , First Publish Date - 2020-06-19T07:14:25+05:30 IST

వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో పదో స్థానంలో నిలి చింది. ఈ జిల్లాలో మొత్తం 8,038 మంది విద్యార్థులు

బాలికలదే హవా

ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

బాలుర కంటే బాలికలదే ఉత్తీర్ణత శాతం ఎక్కువ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన వనపర్తి

చివరి స్థానంలో నిలిచిన నాగర్‌కర్నూల్‌

గతేడాదితో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలు 

మొదటి సంవత్సరం ఫలితాల వివరాలు


మహబూబ్‌నగర్‌, జూన్‌ 18 :

వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో పదో స్థానంలో నిలి చింది. ఈ జిల్లాలో మొత్తం 8,038 మంది విద్యార్థులు పరీక్ష లు రాయగా 4,638 పాస్‌ అయ్యారు. మొత్తం 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 4,126 మంది పరీక్షలు రాయగా, 2,662 మంది పాసై, 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,914 మంది హాజరు కాగా, 1,976 మంది పాసై 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 15 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.


జోగుళాంబ గద్వాల జిల్లా ఉమ్మడి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 4,290 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా, 2,341 మంది పాస్‌ అయ్యారు. మొత్తం 55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,106కి గాను 984 (47 శాతం) మంది పాసయ్యారు. బాలికలు 2,184గాను 1,357 (62శాతం) పాసయ్యారు. ఈ జిల్లాలో కూడా బాలుర కంటే బాలికలు 15 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా ఉమ్మడి జిల్లాలో మూడో స్థానం లో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 10,804 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 5,843 మంది విద్యార్థులు పాసయ్యరు. 54 శాతం ఉ త్తీర్ణత సాధించారు. బాలుర విభాంలో 4,959 మంది పరీక్ష రాయగా, 2,213 మంది పాసై 45 శాతం ఉతీర్ణత సాధిం చారు. బాలికల విభాగంలో 5,845 మంది పరీక్ష రాయగా, 3,630 మంది పాసై 62 శాతం ఉత్తీర్ణత సాదించారు. ఈ జి ల్లాలో బాలురకంటే బాలికలు 17 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.


నారాయణపేట జిల్లా ఉమ్మడి జిల్లాలో చివరి నుంచి రెం డో స్థానంలో ఉండగా, రాష్ట్ర స్థాయిలో 26వ స్థానంలో నిలి చింది. ఈ జిల్లా నుంచి 5,180 మంది పరీక్షలు రాయగా, 2,453 మంది పాస్‌ అయ్యారు. మొత్తం 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 2,254 మంది పరీక్షలు రా యగా, 775 మంది పాసై, 34 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,926 మంది పరీక్షలు రాయగా, 1,678 మంది పా సై, 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురకంటే బాలికలు 23 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉమ్మడి జిల్లాలో చివరి స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 29వ స్థానంలో నిలిచింది. ఈ జి ల్లాలో 6,151 మందికి గాను 2,779 మంది విద్యార్థులు ఉ త్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌  మొదటి సంవత్సరంలో 1,268 మంది విద్యార్థులకు గాను 540 మంది విద్యార్థులు పా సయ్యారు. మొదటి సంవత్సరంలో 45 శాతం ఉత్తీర్ణత సాధించారు.


ద్వితీయ సంవత్సరం ఫలితాల వివరలు

వనపర్తి జిల్లా ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలువ గా, రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 7,523 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,525 మంది పాస్‌ కావడంతో 61 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇందులో బా లురు 3,669 మంది హాజరు కాగా, 1,935 మంది పాస్‌ కా వడంతో 53 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బాలికలు 3,854 మం ది పరీక్షలకు హాజరు కాగా, 2,590 మంది పాస్‌ అయ్యి, 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 14 శా తం ఉత్తీర్ణత ఎక్కువగా సాధించారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా ఉమ్మడి జిల్లాలో రెండో స్థానంలో నిలువగా, రాష్ర్టా స్థాయిలో 15వ స్థాయంలో నిలిచింది. ఈ జిల్లాలో 8,599 మంది పరీక్షలకు హాజరు కాగా, 5,057 మం ది పాసయ్యారు. 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలుర విభాగంలో 4,052 మంది పరీక్షలు రాయగా, 2,039 మంది పాస్‌ కాగా, 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 4,547 మంది పరీక్షలకు రాయగా, 3,018 మంది పాస్‌ కాగా, 66 శాతం మంది విద్యార్థినులు ఉ త్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 16 శాతం ఉత్తీర్ణత ఎక్కువగా సాధించారు.


నారాయణపేట జిల్లా ఉమ్మడి జిల్లాలో మూడో స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 4,654 విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,641 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 2,121 మంది పరీక్షలు రాయగా, 904 మంది పాసై 43 శాతం, బాలికలు 2,533 మంది పరీక్షలు రాయగా 1,737 మంది పాసై, 69 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. బాలుర కంటే బాలికలు 26 శాతం ఉత్తీర్ణత ఎక్కువగా సాధించారు.


జోగులాంబ గద్వల జిల్లా ఉమ్మడి జిల్లాలో చివరి నుంచి రెండో స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 26వ స్థాయంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 3,848 మంది పరీక్షలకు రాయగా, 2,211 (57శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,027 విద్యార్థులకు గాను 998 (49 శాతం) మంది పాసయ్యారు. బాలికలు 1,820 మంది పరీక్షలు రాయగా, 1,213 (67 శాతం) మంది పాసయ్యారు. బాలుర కంటే బాలికలు 18 శాతం ఉత్తీర్ణత ఎక్కువగా సాధించారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉమ్మడి జిల్లాలో చివరి స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 31వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 4,894 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 2,776 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో 934 మంది విద్యార్థులకు గాను 545 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Updated Date - 2020-06-19T07:14:25+05:30 IST