ప్రశాంతంగా ఇంటర్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-03-02T11:54:57+05:30 IST

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (2020- 21)లో ప్రవేశానికి ఆదివారం ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల

ప్రశాంతంగా ఇంటర్‌ ప్రవేశ పరీక్ష

ఇటిక్యాల: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (2020- 21)లో ప్రవేశానికి ఆదివారం ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్ష కు గాను గంట ముందుగానే కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రానికి 700 మంది విద్యార్థులను కేటాయించగా 672 విద్యార్థులు హాజరయ్యారు. 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ ఎల్‌.ఉపేందర్‌ తెలిపారు. డిపార్ట్‌మెంటల్‌ అధికారిగా మల్లయ్య వ్యవహరించగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-03-02T11:54:57+05:30 IST