మోదీ ప్రభుత్వ మహా మోసం పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-12-20T02:56:12+05:30 IST

మోదీ ప్రభుత్వ మహామోసం అనే పుస్తకాన్ని అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సహజకవి డాక్టర్‌ రాములు ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూర్‌లో విడుదల చేశారు.

మోదీ ప్రభుత్వ మహా మోసం పుస్తకావిష్కరణ
మోదీ ప్రభుత్వం మహా మోసం పుస్తకావిష్కరణలో పాల్గొన్న రైతులు

ఆత్మకూర్‌, డిసెంబరు 19: మోదీ ప్రభుత్వ మహామోసం అనే పుస్తకాన్ని అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సహజకవి డాక్టర్‌ రాములు ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులకు పాలక ప్రభుత్వాలు వ్యవసాయానికి సహాయం అందించాలని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర స బ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని, రైతు లేనిదే రాజ్యం లేదని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ రాజన్న, అరుణ్‌కుమార్‌, ప్రసాద్‌, రాజు,రైతులు ఆంజనేయులు, బీమన్న, నారాయణ, వాసిరెడ్డి రైతులు పాల్గొన్నారు.

Read more