ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-11-20T03:35:55+05:30 IST

పేదరిక నిర్మాలన కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి
జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ చిత్ర పటం వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌, నవంబరు 19: పేదరిక నిర్మాలన కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. ఇందిరా హయాంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. గురువారం ఆమె జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ కార్యాల యంలో  చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్‌ మాట్లాడుతూ బ్యాంకులను జాతీయం చేయడం, రాజభరణాలను రద్దు చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. భూ సంస్కరణల ద్వారా పేదలకు ఉచితంగా భూములు పంచిపెట్టిన ఘనత ఇందిరకే దక్కిందన్నారు. దేశాభివృద్ధి కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, చివరికి తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారన్నారు. గరీబి హఠావో నినాదంతో పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు దేశం గర్వించిందన్నారు. ఆమె స్షూర్తితో పార్టీ శ్రేణులు ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నయీం, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, సిరాజ్‌ఖాద్రి, సాయిబాబ, సరో, వెంకటలక్ష్మి, రాములు యాదవ్‌, చంద్రశేఖర్‌, షకీల్‌, అహ్మద్‌ పాల్గొన్నారు. 


రాజాపూర్‌లో..

రాజాపూర్‌: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని మండల కేంద్రంలోని స్థానిక ముఖ్య కూడలిలో నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ యవత మండల అధ్యక్షుడు లింగం, రమణ, రఘు, గోవర్ధన్‌ రెడ్డి, వెంకరటయ్య, శేఖర్‌రెడ్డి, యాదగిరి, నజీర్‌, శ్రీను, కృష్ణ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.


బాదేపల్లిలో..

బాదేపల్లి : బాదేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారతరత్న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని నిర్వహించారు. పట్టణంలోని సిగ్నల్‌గడ్డ వద్ద ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. పలువురు నాయకులు ఆమె చేసిన సేవల గురించి కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మినాజ్‌, వెంకటయ్య, నిత్యానందం, రబ్బానీ, జనార్దన్‌, అనుప కృష్ణయ్య, ఆనంద్‌, రఫీ, ఖాజాపాషా, నసీర్‌, బెన్ను, ఆరిఫ్‌, రఘు, మల్లికార్జున్‌, బాబా పాల్గొన్నారు. 


నవాబ్‌పేటలో..

నవాబ్‌పేట: ఇందిరాగాంధీ జయంతిని మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వి.నర్సిం హాచారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T03:35:55+05:30 IST