ఈ ఏడాది తగ్గిన నేరాలు

ABN , First Publish Date - 2020-12-31T02:52:08+05:30 IST

గతేడాది కంటే ఈయేడు చాలా వరకు నేరాలు తగ్గాయని ఎస్పీ అపూర్వారావు తెలిపారు.

ఈ ఏడాది తగ్గిన నేరాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ అపూర్వారావు

 ఎస్పీ అపూర్వారావు

వనపర్తి క్రైం, డిసెంబరు 30: గతేడాది కంటే ఈయేడు చాలా వరకు నేరాలు తగ్గాయని ఎస్పీ అపూర్వారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 2020 వార్షిక నివేదికను  బుధవారం  ప్రకటించారు. ఎస్పీ మాట్లాడుతూ 2019లో మొత్తం 2160 కేసులు నమోదు కాగా, 2020లో 1894 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది 206 రోడ్డు ప్రమాదాల్లో 278మంది గాయపడి 120   మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈసారి 73 దొంగతనాలు జరగగా గతేడాది కంటే 74 శాతం రికవరీ చేశారన్నారు.  ఆపరేషన్‌ ముస్కాన్‌, స్పైల్‌ ద్వారా 12 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. నేరాల తగ్గడంలో సాంకేతిక పరిజ్ఞానం, జిల్లా పోలీసుల కృషి ఉందన్నారు. ఈ చలాన్‌ ద్వారా 98762 వాహనాలకు జరిమానా వేయగా రూ.4.82 కోట్లు వసూలు అయ్యా   యన్నారు.  కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధించామని, ఎవరి ఇళ్లలో వారు ఉండి సంబురాలు చేసుకోవాలని సూచించారు.  జిల్లా ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు.  అదనపు ఎస్పీ  షాకీర్‌ హుస్సేన్‌, డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఉన్నారు. 

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ 

శ్రీరంగాపురం: మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎస్పీ అపూర్వారావు ప్రారంభించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డి,      అబ్దుల్‌ఖాదర్‌, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌, ఎంపీపీ గాయత్రి, సర్పంచ్‌ వినీలరాణి ఉన్నారు. 

Updated Date - 2020-12-31T02:52:08+05:30 IST