వ్యాక్సిన్‌ నిల్వలను పరిశీలించిన జిల్లా అధికారి

ABN , First Publish Date - 2020-12-06T04:39:04+05:30 IST

మండలంలోని తిర్మలాపూర్‌లో జరుగుతున్న ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా అధికారి డాక్టర్‌ శైలజ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వ్యాక్సిన్‌ నిల్వలను పరిశీలించిన జిల్లా అధికారి

నారాయణపేటరూరల్‌, డిసెంబరు 5 : మండలంలోని తిర్మలాపూర్‌లో జరుగుతున్న ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా అధికారి డాక్టర్‌ శైలజ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు కోటకొండ పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. వచ్చేనెలలో జరిగే పల్స్‌పోలియోకు కావాల్సిన యాక్షన్‌ ప్లాన్‌ కోల్డ్‌చైన్‌ సిస్టమ్‌ను ముందే సిద్ధం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సంతోషిని, సూపర్‌వైజర్‌ గోవింద్‌రాజు, డీఓ గోవింద్‌ రావు, ఏఎన్‌ఎంలు యశోద, అనురాధ, ఆశా వర్కర్లు మంజుల, రేణుక పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:39:04+05:30 IST