గుర్రంగడ్డలో స్వచ్ఛతకు పెద్దపీట

ABN , First Publish Date - 2020-03-23T07:47:10+05:30 IST

దీవి గ్రామం బాహ్య ప్రపంచానికి సం బంధా లు తక్కువే అయిన అక్కడి ప్రజలు స్వ చ్ఛతకు పెద్దపీట వేశారు. ఇంటింటికి ఇం కుడుగుంతలను నిర్మించుకోవడమే కాకుం డా...

గుర్రంగడ్డలో స్వచ్ఛతకు పెద్దపీట

గద్వాల రూరల్‌, మార్చి 22: దీవి గ్రామం బాహ్య ప్రపంచానికి సం బంధా లు తక్కువే అయిన అక్కడి ప్రజలు స్వ చ్ఛతకు పెద్దపీట వేశారు. ఇంటింటికి ఇం కుడుగుంతలను నిర్మించుకోవడమే కాకుం డా చెత్త చెదారాన్ని బయట వేయకుండా డంపింగ్‌ యార్డుకు తరలిస్తుండటంతో పరిశుభ్రంగా కనిపిస్తోంది. గుర్రంగడ్డ గ్రా మంలో మొత్తం 900కు పైగా జనాభా కలిగి ఉండి 172 ఇళ్లు వరకు ఉన్నాయి. లేఅవుట్‌ చేసినట్లు ఇంటింటికి దూరం, వి శాలమైన ఆవరణ కలిగి ఉండటంతో చూ డటానికి ప్రత్యేకంగా ఏర్పడినదిగా కనిపి స్తుంది. ఇక్కడి వారు వ్యవసాయంపైనే  ఆధారపడుతారు.


కృష్ణానదికి విద్యుత్‌ మోటార్లను వేసి పంటలు పండిస్తుండ టంతో మంచి దిగుబడిని సాధిస్తారు. చాలామంది ఆర్థికంగా ఉన్న వారే. గ్రామంలో ఎటుతిరిగిన విశాలమైన రోడ్లు ఉండి ప్రతి రోడ్డుకు లింక్‌కలిగి ఉం టుం ది. ప్రతి సర్పంచు తనకు వచ్చే నిధులను సీసీరోడ్లకే ఖర్చు చేయడం తో గ్రామం లోని రోడ్లన్నీ సీసీరోడ్లుగా మా రాయి. ఎ క్కడ మురుగు కాలువలు లేవు. కాని ఇళ్ల నుంచి వచ్చే మురుగును ఇంకు డుగుం తల ద్వారా భూమిలోకి ఇంకిస్తుండటం తో  మురుగు అనేది కనింపించదు. 95శా తం మంది మరుగుదొడ్లు నిర్మించుకో వ డంతో బహిరంగ మలవిసర్జన అనేది ఉం డదు. ప్రతి ఇంటికి చెత్తబుట్టలు ఇవ్వ డంతో ఇంటింటికి వచ్చే ట్రైసైకిళ్ల వాళ్ల ఇస్తే వారు డంపింగ్‌యార్డుకు తరలిస్తు న్నా రు. ఫలితంగా ఎక్కడ చెత్త కనిపించదు.  


స్వచ్ఛమైన నీటికే ఇబ్బందులు 

 గ్రామానికి మిషన్‌ భగీరథ నీళ్లు ఇ వ్వ లేదు. నేరుగా కృష్ణానది నుంచి పంపింగ్‌ చేసి ఇళ్లకు వదులుతారు. ఆ నీటినే తాగా ల్సి ఉంటుంది. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో వండ్రు నీటినే తాగేవారు. దీంతో చాలామంది అనారోగ్యాలకు గురయ్యేవారు. గత పుష్క రాల సమయంలో నదీ అగ్రహారం లోని భక్తులకోసం తీసుకవచ్చిన ఆర్‌ఓ ప్లాంట్‌ ను  గ్రామానికి కేటాయించ డంతో ఎమ్మె ల్యే ఫండ్‌ ద్వారా గ్రామంలో ఏర్పాటు చే శారు. అప్పటి నుంచే వారు స్వచ్ఛమైన నీ టిని తాగుతున్నారు. దీని నిర్వాహణ సక్రమంగా ఉండకపోవడంతో అప్పుడప్పుడు మరమ్మతులకు వస్తుంది. ఆ సమయంలో మళ్లీ నదీ నీటినే తాగుతారు. 


గ్రామంలో మురుగు  కనిపించదు  

మా గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు కనిపించదు. దాదాపు అన్ని రోడ్లు సీసీగా మారాయి. పరిశుభ్రంగా ఉండటంతో దోమలు కూడా లేవు, మాకు బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడమే మాకు ఉన్న లోటు.

- విజయ్‌, గుర్రంగడ్డ 


 ప్రతి ఒక్కరిలో అవగాహన

గ్రామంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఇంకుడుగుంత, మరు గుదొడ్డిని నిర్మించుకున్నారు. చెత్తను ట్రైసైకిళ్ల వారికి ఇస్తా రు. దానిని డంపింగ్‌యార్డుకు తరలిస్తాం. తాగునీటికి కూడా ఇ బ్బందులు ఉండవు.రాకపోకలకు మాత్రమే అవస్థ పడుతున్నారు. 

- ప్రవీణ్‌కుమార్‌, కార్యదర్శి

Updated Date - 2020-03-23T07:47:10+05:30 IST