పాలమూరులో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-04-08T10:23:56+05:30 IST
పాలమూరులో రెండ్రోజులుగా అకాల వానలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ గాలి

గాలిదుమారంతో కూడిన వడగండ్ల వాన
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7: పాలమూరులో రెండ్రోజులుగా అకాల వానలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి పలు విడతలుగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది.
గాలి దుమా రంతో అక్కడక్కడా చెట్లకొమ్ములు విరిగిపడ్డాయి. జిల్లాకేంద్రంతోపాటు గండీడ్ మండలంలో భారీ వర్షం కురవగా హన్వాడ, నవాబ్‌సేట, భూత్పూర్‌లో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు భగభగమని మండటంతో ఉక్కపోతతో జనం అల్లాడగా సాయంత్రానికి గాలివానతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
నల్లమలలో అకాల వర్షం
అచ్చంపేట: నల్లమల ప్రాంతంలో అకాల వర్షం మంగళ వారం కురిసింది. నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలోని మన్న నూర్‌తోపాటు పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురవడంతో చేతికి వచ్చిన వరి పంట నీట మునిగింది. పట్టణంలో ఈదురుగాలులతో కురి సిన వర్షానికి కాలనీలు బురదమయంగా మారాయి. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.