హరితహారంను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-06-25T10:52:14+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఆరవ విడత హరితహారం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి వనజాత అన్నారు.

రాజాపూర్, జూన్ 24 : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఆరవ విడత హరితహారం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి వనజాత అన్నారు. మండల కేంద్రం లోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల స మావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతికి శ్రీకారం అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో డీపీఎమ్‌ఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఎంపీపీ సుశీలారమేష్ నాయక్, జడ్పీటీసీ మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.