-
-
Home » Telangana » Mahbubnagar » Hanuman Rathayatra
-
ఊరేగి రావయ్య హనుమా..
ABN , First Publish Date - 2020-12-31T03:31:33+05:30 IST
పడమటి ఆంజనేయస్వామి రథోత్సవం కన్ను ల పండువగా సాగింది.

మక్తల్, డిసెంబరు 30 : పడమటి ఆంజనేయస్వామి రథోత్సవం కన్ను ల పండువగా సాగింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో వెలిసిన పడమ టి ఆంజనేయ స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆరు గంటలకు వేలాది మంది భక్తజనుల మధ్య రథోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు పల్లకీ సేవ, సాయంత్రం నాలు గు గంటలకు మంగళహారతి కార్యక్రమాలు జరిగాయి. రథోత్సవానికి ఉ మ్మడి పాలమూరు జిల్లా నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బాల్చెడ్ పావనీ మల్లికార్జున్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ వనజ ఆంజనేయులుగౌడ్, డీసీసీ చైర్మన్ నిజాంపాష, ఎంపీపీ వనజదత్తు, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌గౌడ్ దంపతులు, కాంగ్రెస్ నాయకులు వి.శ్రీ హరి, రాజుల ఆశిరెడ్డి, బీజేపీ నాయకులు కొండయ్య, కర్నిస్వామి, బాల్చెడ్ మల్లికార్జున్, బలరాంరెడ్డి, వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్‌రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ఎస్పీ చేతన పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భీమాచార్య, ఈవో సత్యనారాయణ, ఆలయ సిబ్బంది రజనీకాంత్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ముగిసిన మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు
పదర : నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు పబ్బ తి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యశాస్త్రి, టీటీడీ నుంచి వచ్చిన రుత్వికుల సమ క్షంలో ఉదయం అష్టోత్తర శత కలాశాలు (108) కృష్ణా జలాలతో, 41 క లాశాలు భద్రాచలం నుంచి తెచ్చిన గోదావరి నది జలాలతో మహాకుం భాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామశర్మ,ఎంపీపీ బి క్యనాయక్ పాల్గొన్నారు. అంతకు ముందు ఎంపీ రాములు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.