35వేల విలువైన గుట్కాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-28T02:58:46+05:30 IST

హైదరాబాద్‌ నుంచి అచ్చంపేటకు తుఫాన్‌ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 35వేల విలువైన గుట్కాలను శుక్రవారం సాయంత్రం వెల్దండ పోలీసులు పట్టుకున్నారు.

35వేల విలువైన గుట్కాలు స్వాధీనం

వెల్దండ, నవంబరు 27: హైదరాబాద్‌ నుంచి అచ్చంపేటకు తుఫాన్‌ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 35వేల విలువైన గుట్కాలను శుక్రవారం సాయంత్రం వెల్దండ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా అచ్చంపేటకు చెందిన అశోక్‌ గుప్తా వాహనంలో గుట్కాలను తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు. 

Read more