గద్వాలకు..కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-05-24T10:15:40+05:30 IST

మళ్లీ జోగుళాంబ గద్వాల జిల్లాకు కరోనా ముప్పు పొంచి ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లాలో ఎక్కువగా కేసులు

గద్వాలకు..కరోనా ముప్పు

రాయచూర్‌లో పెరుగుతున్న కేసులు

శనివారం ఒక్క రోజే 39 పాటిజివ్‌లు

అప్రమత్తమవుతున్న జిల్లా అధికారులు


గద్వాల క్రైం, మే 23 : మళ్లీ జోగుళాంబ గద్వాల జిల్లాకు కరోనా ముప్పు పొంచి ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో జిల్లా వాసుల్లో భయాందోళన నెలకొన్నది. ఇప్పటి వరకు రాయచూర్‌ జిల్లాలో 64 కేసులు నమెదు కాగా, శనివారం ఒక్క రోజే 39 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కర్ణాటకు నుంచి గద్వాల జిల్లాకు 226 మంది వలస కార్మికులు రావడంతో, వారిలో ఎవరికైనా కరోనా ఉందేమోనన్న భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.


వీరే కాకుండా అనధికారికంగా కూడా కొందరు గద్వాలకు చేరుకున్నట్లు తెలిసింది. అయితే, ఇలా వలసలు వచ్చిన వారిని వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారా? వారిని ఎప్పటికప్పడు పరిశీలిస్తున్నారా? అన్న అనుమానాలతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఉన్న 45 కరోనా కేసులు పూర్తిస్ధాయిలో నయం అయ్యాయనుకున్న తరుణంలో కర్ణాటక నుంచి వచ్చిన వలసల కూలీల వల్ల మళ్లీ కరోనా వ్యాపిస్తుందా అన్న భయంతో వణికిపోతున్నారు.


5,186 మంది కూలీల రాక

జోగుళాంబ గద్వాల జిల్లాకు శనివారం వరకు వివిధ రాష్ట్రాల నుంచి 5,186 మంది వలస కూలుఉ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 3,002 మంది, కర్ణాటక నుంచి 226, తమిళనాడు నుంచి 39, మహారాష్ట్ర నుంచి 49, ఢిల్లీ నుంచి ముగ్గురు. ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, ఒరిస్సా నుంచి ఒకరు, రాజసాఽ్ధన్‌ నుంచి 17, తెలంగాణ ఇతర జిల్లాల నుంచి 1,835 మంది వచ్చారని, వీరందరిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-24T10:15:40+05:30 IST