-
-
Home » Telangana » Mahbubnagar » grand celebrations lakmi venkateshwara bramaustalvau
-
కొనసాగుతున్న లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-28T02:05:33+05:30 IST
మండల కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీవేం కటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

మల్దకల్, డిశంబరు 27: మండల కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీవేం కటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ఆదివారం హనుమద్‌వ్రతం ఆతర్వాత పల్లకిసేవను నిర్వహించారు. ఉదయం బలిహరణ కార్యక్రమం నిర్వహించి మయూర వాహనంపై స్వామివారిని ఊరే గించారు. సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం రాత్రి బలిహరణ చేసి ప్రభా వాహనంపై ఊరేగింపు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వా మివారిని దర్ళించుకున్నారు. సోమవారం రాత్రి 11గంటలకు స్వామివారిని కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే ఆగిన అభివృద్ధి : రవికుమార్
అలంపూర్, డిసెంబరు 27: పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అలంపూర్‌లో అభి వృద్ధి ఆగిపోయిందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రవికుమార్ అన్నారు. వివేకా నంద యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ‘మన ఊరు-మన వేల్పు’ చర్చావేదికలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వివేకానంద యూత్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ చర్చావేదికలో అలంపూర్ అభివృద్ధిపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం నాయకులు పాల్గొని పలు అంశాలను చర్చించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకుడు రాజన్న, మునిసిపల్ చైర్‌పర్సన్ మనోరమ, కౌన్సిలర్లు సుదర్శన్‌గౌడు, ఇంతియాజ్, డైరక్టర్ రమేష్, దేవదాసు, రఘు, సుబ్బన్న గౌడు, మాజీ సర్పంచ్ పిండి జయరాములు, ఉపాధ్యాయుడు రమేష్ తదితరులు ఉన్నారు.
11కేకేటీ 27: గండిని పరిశీలిస్తున్న వామన్‌గౌడ్
నల్ల చెరువు గండికి మరమ్మతులు ప్రారంభం
కొత్తకోట, డిసెంబరు 27: మండలంలోని పాలెం గ్రామ నల్లచెరువు గండికి మర మ్మతు ప నులను ఆదివారం జడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ ప్రారంభించారు. వారం రో జుల కిందట చెరు వుకు గండి పడింది. యాసంగిలో వరి పంటలకు నీరు అందించే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి ఆదేశం మేరకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు వామన్‌గౌడ్ తెలిపారు. ఏఈ ఖదీర్, అలీం, గాడిల ప్రశాంత్, బాలయ్య, మన్యంకొండ, రామకృష్ణ పాల్గొన్నారు.
12కేకేటీ 27: మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగందర్‌గౌడ్
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి : రాచాల
కొత్తకోట, డిసెంబరు 27: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.70లక్షల ఉద్యోగాలను వెం టనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యు గంధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని బెస్ట్ గ్రామర్ స్కూల్‌లో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేయడానికే సీఎం కేసీ ఆర్ ఉద్యోగాల ప్రకటన ప్రకటించాడని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఖాళీల సంఖ్యను 50000పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. భీమన్న, అంజయ్యయా దవ్, రాఘవేందర్‌గౌడ్, సురేష్‌బాడు, అఫ్రీజ్, అక్రమ్ పాల్గొన్నారు.
వారబందీ ప్రారంభం
ఆత్మకూర్, డిసెంబరు 27: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు వారబందీ మాదిరిగా నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ నారాయణ తెలిపారు. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చిన కారణంగా వారం రోజులుగా నిరంతరాయంగా నీటి విడుదల చేశామన్నారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు విడుదల చేసి శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు నీటి విడుదల నిలిపి వేస్తామని, రైతులు పొదుపుగా నీటిని వాడుకోవాలని కోరారు.
13కేకేటీ 27: మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్
నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత, డిసెంబరు 27: తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ యువత బలిదానాలు చేసినా వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగా లను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేపడుతామని తెలిపారు. ఉద్యోగ సాధనకు జరిగే ఈ నిరసనలో నిరుద్యో గులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుతుబ్, అజ్మిత్, వినోద్, షాకీర్ పాల్గొన్నారు.
110జిడిఎల్27.ఫోటో..... మయూర వాహనంపై ఊరేగుతున్న స్వామివారు
కొనసాగుతున్న లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
మల్దకల్, డిసెంబరు 27: మండల కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీవేం కటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ఆదివారం హనుమద్‌వ్రతం ఆతర్వాత పల్లకిసేవను నిర్వహించారు. ఉదయం బలిహరణ కార్యక్రమం నిర్వహించి మయూర వాహనంపై స్వామివారిని ఊరే గించారు. సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం రాత్రి బలిహరణ చేసి ప్రభా వాహనంపై ఊరేగింపు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వా మివారిని దర్ళించుకున్నారు. సోమవారం రాత్రి 11గంటలకు స్వామివారిని కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.