ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2020-12-26T03:14:06+05:30 IST

క్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకొని క్రిస్టియన్‌ సోదరులు సోమవారం జిల్లావ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
భక్తులకు సందేశమిస్తున్న పాస్టర్‌

 చర్చిల్లో  ప్రత్యేక ప్రార్థనలు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 25: క్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకొని క్రిస్టియన్‌ సోదరులు సోమవారం జిల్లావ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంబీ ఓలీవ చర్చిలో చైర్మన్‌ రెవరెండ్‌ ఎస్‌ఎం జాన్‌ ఆధ్వర్యంలో  వేడుకలను నిర్వహించారు.          ముఖ్యఅతిథిగా ఎంబీసీ బైబిల్‌ కాలేజ్‌ రిజిస్ట్రార్‌ రెవరెండ్‌ శ్యామ్‌రావ్‌ హాజరై ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆరంభ ప్రార్థనలు బ్రదర్‌ అమృత్‌సాగర్‌ చేయగా బ్రదర్‌ పీడీ ఏసయ్య బైబిల్‌లోని ముఖ్యమైన ఘట్టాలను చదివి వినిపించారు. ఇక ఏసురత్నం, బీపీ క్లారా, పీడి విజయ్‌కుమార్‌తో పాటు ప్రీతి సుధ, వనజశ్రీ ప్రత్యేక గీతాలు ఆలపించారు. పీడీ కమలమ్మ, బ్ర దర్‌ బీపి ఎర్నెస్ట్‌, కేటి మార్టీన్‌ ప్రేయర్‌ చేశారు.  

కేక్‌ కట్‌ చేసిన జూపల్లి 

వీపనగండ్ల: చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో క్రిస్టియన్‌ సోదరులు క్రి స్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వీపనగండ్ల చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని కేక్‌ కట్‌చేశారు. ఎంపీపీ కమలేశ్వర్‌రావు, సర్పంచ్‌ వంగూరి నరసింహరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నా రాయణరెడ్డి, గంగిరెడ్డి, రవీందర్‌రెడ్డి, పాస్టర్‌ ఎర్మియా పాల్గొన్నారు.

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

కొత్తకోట/ ఆత్మకూర్‌/ అమరచింత/ పెద్దమందడి: కొత్తకోట మండలంలోని కానాయపల్లి, కనిమెట్ట, పాలెం, వడ్డెవాట, పామాపురం, మిరాసిపల్లి, అమడబాకుల గ్రామాల్లోని క్రిస్టియన్‌ సోదరులు చర్చిల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. అమడ బాకులలో పేద క్రిస్టియన్లకు పాస్టర్‌ నాగభూషణం బట్టలు పంపిణీ చేశారు. జడ్పీ వైస్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుఖేశినితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు చర్చిలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూర్‌, అమరచింత, పెద్దమందడి మండలాల్లోని ఆయా గ్రామాల చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  మునిసిపల్‌ చైర్‌ పర్‌పర్సన్‌ గాయత్రి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ బిజయ్‌ భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సాయిచంద్‌లు పాల్గొని క్రిస్మస్‌ వేడుకల కేక్‌ను కట్‌ చేసి ప్రజలుకు అందించారు. Updated Date - 2020-12-26T03:14:06+05:30 IST