-
-
Home » Telangana » Mahbubnagar » govt no give to jobs for unemployees
-
నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
ABN , First Publish Date - 2020-12-28T02:03:46+05:30 IST
తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ యువత బలిదానాలు చేసినా వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ అన్నారు.

అమరచింత, డిసెంబరు 27: తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ యువత బలిదానాలు చేసినా వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగా లను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేపడుతామని తెలిపారు. ఉద్యోగ సాధనకు జరిగే ఈ నిరసనలో నిరుద్యో గులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుతుబ్, అజ్మిత్, వినోద్, షాకీర్ పాల్గొన్నారు.