రాష్ట్ర ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు

ABN , First Publish Date - 2020-12-14T02:59:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు
మాట్లాడుతున్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి

 టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి

అయిజ, డిసెంబరు 13: రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగులకు,  నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ కు టుంబం బాగుపడిందే తప్ప ఏ ఒక్కరూ బాగుపడిన దాఖలాలు లేవని తెలియచెప్పారు. కేసీ ఆర్‌ ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. మన కోసం పనిచేసే వారిని ఎన్నుకుని మన బాగు మనమే చేసుకుందామని గుర్తు చేశారు. అంతకు ముందు అయిజ పట్టణంలో ద్వి చక్రవాహన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌కు పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T02:59:58+05:30 IST