-
-
Home » Telangana » Mahbubnagar » Government Inter
-
ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ హవా
ABN , First Publish Date - 2020-06-22T11:01:49+05:30 IST
ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు హవా సాగిస్తున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో 66 శాతం, ప్రైవేట్ లో 54 శాతం ఉత్తీర్ణత
బాలనగర్ గురుకులంలో వంద శాతం ఫలితాలు
గురుకులాల్లో 85 శాతం ఫలితాలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం జూన్ 21: ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు హవా సాగిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే 2019-2020 విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో కూడా ఉత్తీర్ణత శాతంలో ముందున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 72 జూనియర్ కళాశాలకు చెందిన 19,373 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 10,899 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో 7,373 మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదివారు. ఇందులో 4,049 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ప్రైవేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు 12,030 పరీక్షలకు హాజరు కాగా 6,850 మంది పాస్ అయ్యారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళశాలకు చెందిన 3049 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,024 మంది ఉత్తీర్ణులయ్యారు. 66 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ప్రైవేట్ కళాశాలలో 5,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3818 మంది పాస్ అయ్యారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బాలనగర్ గురుకుల బాలికల కళాశాలకు చెందిన జూనియర్, సీనియర్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిదంవగా టీటీడబ్య్లూఆర్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు 98.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీ చిన్నగుల్ల తండా విద్యార్థులు 85 శాతం, తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాల మహబూబ్‌నగర్ విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది మాత్రం 54 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వ కళాశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి - వెంటేశ్వర్లు డీఐఈవో మహబూబ్‌నగర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. గత ఏడాది కంటే ఆరు శాతం మెరుగు పడింది. సీనియర్ ఇంటర్‌లో ప్రైవేట్ కళాశాల కంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులే పైచేయి సాధించారు.