ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2020-12-29T03:41:33+05:30 IST

నల్లమల ప్రాంతానికి ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ముఖ్యమంతి, ఎమ్మెల్యే ఏమి చేశారో ప్రజలకు వివరించాలని, అదేవిధంగా ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట, డిసెంబరు 28: నల్లమల ప్రాంతానికి ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ముఖ్యమంతి, ఎమ్మెల్యే ఏమి చేశారో ప్రజలకు వివరించాలని, అదేవిధంగా  ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని  డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమవారం పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ  జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని పటేల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడారు. గత మునిసిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచి అచ్చంపేట మునిసిపాలిటీలో ఏం పనులు చేశారో ప్రజలకు వివరించాలన్నారు. కార్యకర్తలకు ప్రభుత్వ మోస పూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిత్యం పోరాటం చేయాలన్నారు.  పార్టీ నాయకులు చత్రునాయక్‌, హరిశ్చంద్ర, వెంకట్‌ రెడ్డి, గౌరిశంకర్‌, శేఖర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురువేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోటయ్య, నారాయణగౌడ్‌, బాలగౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, నాయకులు వల్లభ్‌రెడ్డి, హ బీబ్‌, సలీం, గంగాధర్‌, బావిద్‌, భీమయ్య, వెంకటేష్‌, అహ్మద్‌పాష, కౌన్సిలర్లు ఎండీ.నిజాం, సుల్తాన్‌, జ్యోతి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రావు, నాయకులు హరీఫ్‌గౌడ్‌, మల్లేష్‌, మస్తాన్‌, ఉదయ్‌యాదవ్‌, శ్రీను, ఎస్‌ఎస్‌యుఐ నాయకులు సురేందర్‌యా దవ్‌ తదితరులు పాల్గొన్నారు.  


ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేయాలి

కల్వకుర్తి అర్బన్‌: అధికారమే లక్ష్యంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయం గా పని చేయాలని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి అ న్నారు. పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా ఇంద్రానగర్‌ కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కేక్‌ కట్‌ చేసి కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆ విష్కరించారు. కాంగ్రెస్‌ నాయకులు మిర్యాల శ్రీనివా స్‌రెడ్డి, మల్లే పల్లి జగన్‌, బాల్‌రెడ్డి, శ్రీరాములుగౌడ్‌, ఏజాజ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రామ రాజు, గోవింద్‌, ఆంజనేయులు, షాకేర్‌, జంగయ్య, పోల ప్రవీణ్‌ కుమార్‌, నాని, పాండురంగారెడ్డి, అనిల్‌గౌడ్‌, చంద్రకాంత్‌, శ్రీకాంత్‌, రామకృష్ణ, జావిద్‌, నిజామ్‌, జిలాని తదితరులు పా ల్గొన్నారు. 


కొల్లాపూర్‌లో..

కొల్లాపూర్‌:  కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం కొల్లాపూర్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించి నేతల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రంగినేని జగదీశ్వ రుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాముయాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పరశురామ్‌నాయుడులు మాట్లాడారు.   పెద్దకొ త్తపల్లి మండల అధ్యక్షుడు టి.కృష్ణయ్య, నాయకులు శివప్రసాద్‌, సుల్తాన్‌, కోడేరు మండలాధ్యక్షుడు శాంతన్న, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు కే.రాము, నాయకులు శిలం వెంకటేశ్‌, కాంతారావు, మధు, చెన్నయ్య, ఏ.వసంతకుమార్‌, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T03:41:33+05:30 IST