తెలంగాణలో గౌడ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-27T03:11:55+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో గౌడ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 5వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటా యించాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కె వీరస్వామిగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో గౌడ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
పాదయాత్ర నిర్వహిస్తున్న గౌడ సంఘం నాయకులు

- సర్వాయిపాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జే.వీరస్వామిగౌడ్‌ డిమాండ్‌

కొల్లాపూర్‌, డిసెంబరు 26: తెలంగాణ రాష్ట్రంలో గౌడ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 5వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కె వీరస్వామిగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం కొల్లాపూర్‌ పట్టణంలో సర్వాయిపాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర పేరుతో కొల్లాపూర్‌ పట్టణ వీధులగుండా పాదయాత్ర నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రపదేశ్‌లో గౌడ సంఘం ఏర్పాటు చేసి కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, అదే మాదిరి తెలంగాణలో కూడా కల్లుగీత కార్మికు లు ఉన్నత న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారి నసీర్‌కు అందజేశారు. అనంతరం స్థానిక మహబూబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సభలో వీరాస్వామిగౌడ్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలో జీవో 560ప్రకారం ప్రతి గ్రామ గౌడ సొసైటీకి 10ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  గౌడ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మధుసూదన్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు మాచర్ల రామకృష్ణగౌడ్‌,  పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు డి.సుదర్శన్‌గౌడ్‌, తాలుకా కన్వీనర్‌ గోవింద్‌గౌడ్‌, మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, గౌడ సంఘం ఉమ్మడి జిల్లా గౌడ సంఘం నాయకులు వంగ రాజశేఖర్‌ గౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, యాదన్నగౌడ్‌, సురేందర్‌గౌడ్‌, పరుశరామ్‌గౌడ్‌, ఎల్లగౌడ్‌, విజయ్‌గౌడ్‌, రామన్‌గౌడ్‌  పాల్గొన్నారు. Updated Date - 2020-12-27T03:11:55+05:30 IST