గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయించాలి

ABN , First Publish Date - 2020-12-02T03:07:04+05:30 IST

గొర్రెలు, మేకల యజమానులు వాటికి విధిగా నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ అంజలప్ప సూచించారు.

గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయించాలి

తిమ్మాజిపేట, డిసెంబరు 1:  గొర్రెలు, మేకల యజమానులు వాటికి విధిగా నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ అంజలప్ప సూచించారు. తిమ్మాజిపేటలో మంగళవారం గొర్రెలు, మేకల నట్టల నివారణ మందులు వేసేందుకు ఏర్పాటు చేసిన పశు వైద్యశిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు.  జిల్లాలోని అన్నీ మండలాల్లో నట్టల నివారణ మందులు వేసేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువైద్యాధికారులు డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ శివరాజ్‌, జెవిఓలు అసిస్టెంట్‌ తిరుపతి ఉన్నారు.

చారకొండ: స్థానిక పశువైద్య కేంద్రంలో మంగళవారం పశువైద్యాధికారిణి డాక్టర్‌ య మున ఆధ్వర్యంలో సర్పంచ్‌ గుండె విజేందర్‌గౌడ్‌ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మం దును వేశారు.  ఉప సర్పంచ్‌ రాణినరేందర్‌రెడ్డి, సిబ్బంది శివరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T03:07:04+05:30 IST