ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-16T03:49:56+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 50వేల ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి
తహసీల్దారు గోపాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేవైఎం నాయకులు

- బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి

- బీజేవైఎం ఆధ్వర్యంలో తహసీల్దారుకు వినతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 15: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 50వేల ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేవైఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళ వారం జిల్లా కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, ని యామకాలే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం లో నిరుద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయులు పూర్తిగా దగా పడ్డార ని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఆరేళ్ల పాలనలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఉద్యోగాలు ఇదిగో, అదిగో అంటూ ఆశలు రేపిస్తూ కాలయాపన చేస్తూ యావత్‌ తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని ఆరోపించారు. లక్ష ఉ ద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతామని గొప్పలు చె ప్పిన కేసీఆర్‌ ఆచరణ మాత్రం అధ్వన్నంగా ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎ న్నికల హామీ నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయి న ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృ తం చేస్తామని హెచ్చరించారు బీజేవైఎం నాయకులు రాము, ఎలిమె రాము, ఆం జనేయులు, సంజయ్‌, భరత్‌, సూరి, బాబు, తిరుపతయ్య, అచ్యుతారెడ్డి, శ్రీశైలం, శవశంకర్‌, నరేంద్ర, నేష లక్ష్మయ్య, వెంకటయ్య, మల్లేష్‌, రాము,విజేందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   Updated Date - 2020-12-16T03:49:56+05:30 IST