-
-
Home » Telangana » Mahbubnagar » give me gudgement
-
మాకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:02:18+05:30 IST
మండల పరిధిలోని పేరపళ్ల తండాకు చెందిన కిషన్ నాయ క్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

- పోలీస్‌స్టేషన్ ఎదుట
బాధిత కుటుంబసభ్యులు ధర్నా
- పూర్తిస్థాయి విచారించి చర్యలు
తీసుకుంటాం: పోలీసులు
నారాయణపేట క్రైం, డిసెంబరు 15: మండల పరిధిలోని పేరపళ్ల తండాకు చెందిన కిషన్ నాయ క్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, తండాకు చెందిన కొంతమంది నారాయణపేట పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాకు చెందిన కిషన్‌నాయక్ (57)పై మే 18న సర్పంచ్ రాజారాం దాడి చేయ డంతో మృతి చెందాడన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సర్పం చ్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు అయిందన్నారు. కిషన్‌నాయక్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జ రిగే వరకు రాస్తారోకో విరమించేంది లేదని భీష్మిం చారు. ఎట్టకేలకు పోలీసుల హామీతో ధర్నా విరమిం చుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ చంద్రమోహన్ ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఈ ఘటనకు సం బంధించి సమగ్ర విచారణ జరిపిస్తాం. దాడి చేయ డంతోనే కిషన్‌నాయక్ మృతి చెందాడా.. ఇతర ఆరో గ్య సమస్యల కారణంగా మృతిచెందాడా అనేది వైద్యుల నుంచి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరు వాత తేలుతుంది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సమాధానం ఇచ్చారు.