-
-
Home » Telangana » Mahbubnagar » gandi repairs started to zp vice chairman
-
నల్ల చెరువు గండికి మరమ్మతులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-28T01:59:36+05:30 IST
మండలంలోని పాలెం గ్రామ నల్లచెరువు గండికి మర మ్మతు ప నులను ఆదివారం జడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ ప్రారంభించారు.

కొత్తకోట, డిసెంబరు 27: మండలంలోని పాలెం గ్రామ నల్లచెరువు గండికి మర మ్మతు ప నులను ఆదివారం జడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ ప్రారంభించారు. వారం రో జుల కిందట చెరు వుకు గండి పడింది. యాసంగిలో వరి పంటలకు నీరు అందించే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి ఆదేశం మేరకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు వామన్‌గౌడ్ తెలిపారు. ఏఈ ఖదీర్, అలీం, గాడిల ప్రశాంత్, బాలయ్య, మన్యంకొండ, రామకృష్ణ పాల్గొన్నారు.