ఆశలన్నీ.. అమాత్యులపైనే !

ABN , First Publish Date - 2020-03-02T11:59:57+05:30 IST

నారాయణపేట జిల్లా ఆవిర్భవించి ఏడా ది పూర్తి చేసుకొని రెండవ వసంతం లోకి అడుగిడింది. జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మొదటి సారిగా నారాయణపేట జిల్లాకు సోమవారం రాష్ట్ర

ఆశలన్నీ.. అమాత్యులపైనే !

  • గ్రామీణ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిసేనా? 
  • నేడు పేటకు పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాక

నారాయణపేట: నారాయణపేట జిల్లా ఆవిర్భవించి ఏడా ది పూర్తి చేసుకొని రెండవ వసంతం లోకి అడుగిడింది. జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మొదటి సారిగా నారాయణపేట జిల్లాకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటి పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి విర సనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా రానున్నా రు. సింగారం చౌరస్తాలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలకు శం కుస్థాపన, మీనాస్‌పూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు సంబంధించి ఎక్లాస్‌పూర్‌లో శంకు స్థాపనలు చేయనున్నారు. జీపీ శెట్టి ఫంక్షన్‌ హాల్‌లో పంచాయతీ రాజ్‌ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనను న్నారు. ఇద్దరు మంత్రులు జిల్లాకు వస్తున్నందున ఏ మేరకు వరాల జల్లు కురిపిస్తారోనని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 11 మం డలాలకు గాను 6,90,770 లక్ష జనా భా ఉన్నది. 1,08,726 నివాసాలు, 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 280 గ్రామ పంచాయతీల్లో కొత్తగా 91 గ్రా మ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త పంచాయతీలకు సొంత భవ నాలు మంజూరు కావాల్సి ఉంది. 91 కొత్త పంచాయతీ భవనాల నిర్మాణా నికి జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


ట్రాక్టర్లు సరే.. ట్రాలీలేవీ?


280 పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగో ళ్లు జిల్లాలో పూర్తయ్యాయి. ఇంకా నీటి ట్యాంకులు, ట్రాలీలు ట్రాక్టర్లకు సగ భాగం కొనుగోలు చేయాల్సి ఉంది. గ్రా మీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని పరిష్క రించేందుకు మిషన్‌ భగీరథ దోహదప డుతున్నది. ఇంకా పలు గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు అందాల్సి ఉండ గా అక్కడక్కడా ట్యాంకుల నిర్మాణా లు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నారాయణపేట ము నిసిపాలిటీలో మిషన్‌ భగీరథ పనులు అసంపూర్తితో వెక్కిరిస్తున్నాయి. పైపు లైన్లు ఏర్పాటు చేయకపోగా అసంపూ ర్తి మిషన్‌ భగీరథ ట్యాంకులు దిష్టిబొ మ్మల్లా మారాయి. మునిసిపాలిటీ పాత పైపులైనుకే మిషన్‌ భగీరథ నీటి ని మళ్లించి అందిస్తుండడంతో రోజు విడిచి రోజు తాగునీరు అందుతోంది. 280 పంచాయతీలకు 261 వైకుంఠ ధామాలకు ఆమోదం లభించగా ఉపాఽ ది హామీ పథకం కింద 37 వైకుంఠ ధామాల పనులు ప్రారంభం కాగా రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగ తావి నిర్మాణంలో ఉన్నాయి. మహిళా సంఘాల చురుకుగా పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వృద్ధాప్య పింఛన్‌ వయసును 65 నుంచి 57 ఏళ్లకుతగ్గిస్తామని పేర్కొనడంతో జిల్లా వ్యాప్తంగా 5,007 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించిన ప్పటికీ ఇంకా వారికి పింఛన్లు మంజూరు కావాల్సి ఉంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతం నారాయణపేట జిల్లా కావడంతో ఆశించిన అభివృద్ధి జరగకా అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ ప్రాంతానికి మంత్రులు వస్తుండడంతో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.


ఎక్లాస్‌పూర్‌ కొండపై ఎకోపార్కు


  • నేడు శంకుస్థాపన చేయనున్నమంత్రి
  • మీనాస్‌పూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని 
  • 87 ఎకరాల గుర్తింపు

నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్‌ కొండపై కొలువు దీరిన తిమ్మప్ప (వేంకటేశ్వర స్వామి) ఆలయానికి వెనుక నే ఉన్న కొండల్లో భారీ ఎకో పార్కు ఏర్పాటుకు నేడు పం చాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతగా రూ.31.68 లక్షలు నిధులు మంజూరు కావ డంతో ఎకోపార్కు పనులు ప్రారంభం కానున్నాయి. మీనాస్‌పూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని ఎక్లాస్‌పూర్‌ కొండల్లో ఫారెస్ట్‌ బ్లాక్‌ నంబర్‌ 409, 410లో గుట్టల్లో (ప్రభుత్వ స్థలం) 87 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవైపు ఎక్లాస్‌పూర్‌ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుండ గా మరోవైపు పర్యాటక ప్రాంతంగా ఆలయం గట్టు వె నుక ఉన్న కొండల్లోమయూరి తరహాలో భారీపార్కు ఏర్పాటుతో ఎక్లాస్‌పూర్‌ కొండకు త్వరలో మహర్దశ లభించనుంది. గుట్టల మధ్య వాకింగ్‌ ట్రాక్‌, ఎకో పార్కు, వాటర్‌ ఫాల్స్‌, కృత్రిమ వానలు, రోప్‌వే, ప్లాన్‌టేష న్‌ తదితర ఎన్నో రకాల ఆహ్లాదకర వాతావరణం నెలకొ ల్పేందుకు రూ.4 కోట్లకు పైగానే నిధులు అవసరం ఉంది. కాగా, షీప్‌ రూప్‌వాల్‌కు రూ.1.02 కోట్లకు సంబంధించి ఈ టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లను ఓపెన్‌ చేయాల్సి ఉంది. దశలవారిగా వచ్చే నిధులతో ఎక్లాస్‌పూర్‌ కొండపై ఎకో పార్కు నిర్మాణంతో భవిష్యత్తులో జిల్లా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అన్ని సౌకర్యాలతో అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. 

Updated Date - 2020-03-02T11:59:57+05:30 IST