నిధులు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2020-10-16T06:14:53+05:30 IST

ఎస్పీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో గట్టు

నిధులు మంజూరు చేయాలి

గట్టు అక్టోబరు15: ఎస్పీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో గట్టు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మాట్లాడుతూ 2018-2019లో జిల్లాలో 364 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని, వారికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రు.4.33 కోట్లు రావాల్సి వున్నదని, రెండు నెలలు దాటుతున్నా సబ్సిడీ రావడం లేదన్నారు. లబ్ధి దారులు అప్పులు చేసి యూనిట్లు పెట్టుకున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల మంజూరు కోసం బ్యాంకర్లు లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు తీసుకుంటున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతున్నా, నేటికీ యాక్షన్‌ ప్లాన్‌ విడుదల చెయ్యక పోవడంపై అధికారులపై మండిపడ్డారు. గట్టు మండలంలో అన్‌స్కిల్డ్‌ 22 మందికి, స్కిల్డ్‌ ఎనిమిది మందికి మొత్తం రు.30లక్షలు మంజూరు కావాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో 19న కలెక్టరేట్‌ ముందు ఆందోళన నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో పాండుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, కర్రెప్ప ఉన్నారు.


వెంటనే రుణాలు అందించాలి

ఉండవల్లి : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు వెంటనే రుణాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ కేవీపీఎస్‌ మండల శాఖ ఆద్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్నహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పరశురాం మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి గాను ఇప్పటివరకు రుణాలు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడిఓ పద్మావతికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శివసేన జిల్లా అధ్యక్షుడు శంకర్‌, కొండన్న, రాంబాబు, మద్దిలేటి, నరసింహ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-16T06:14:53+05:30 IST