ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం

ABN , First Publish Date - 2020-06-16T10:57:42+05:30 IST

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక

ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం

మాజీ మంత్రి డీకే అరుణ


గద్వాల, జూన్‌ 15 : కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో సోమవారం బీజేపీ, ఓబీసీ జిల్లా కార్యవర్గాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్ళలో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ నాయకురాలు బంగారు శ్రుతి, అప్సర్‌ పాషా, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రరెడ్ది, నందిన్నె ప్రకాశ్‌రావు, ఓబీసీ అధ్యక్షుడు డీటీడీసీ నర్సింహులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-06-16T10:57:42+05:30 IST