ఫి(ని)ష్‌!

ABN , First Publish Date - 2020-12-31T03:37:16+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొ ల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌ నుంచి అచ్చంపేట నియోజవర్గం పాతళగంగ వరకు దాదాపు 70 కిలోమీటర్ల మేర నల్లమలను ఆనుకొని కృష్ణానది తీరం ఉం ది.

ఫి(ని)ష్‌!
చేప పిల్లలను ఎండబెట్టిన దృశ్యం (ఫైల్‌)

- కృష్ణానదిలో అలివి వలలతో సాగుతున్న చేపల వేట

- దళాబ్దాలుగా దందా సాగిస్తున్న మత్స్య మాఫియా

- ఆంధ్ర జాలర్లకు బయానా ఇచ్చి ఒప్పందం

- చేప గుడ్డుతో సహా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం

- దందాకు సహకరించాలనిఓ ప్రజాప్రతినిధిని కలిసిన దళారులు

- ‘నో’ చెప్పి హెచ్చరించిన నాయకుడు


కొల్లాపూర్‌ రూరల్‌, డిసెంబరు 30 : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొ ల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌ నుంచి అచ్చంపేట నియోజవర్గం పాతళగంగ వరకు దాదాపు 70 కిలోమీటర్ల మేర నల్లమలను ఆనుకొని కృష్ణానది తీరం ఉం ది. ఈ తీరం వెంట దాదాపు కొన్ని వేల మత్స్యకారుల కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. చేపల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకొని పొట్టపోసుకుంటున్నాయి. అయితే, ఇక్కడి చేపల సంపదపై మత్స్య మాఫియా కన్నెసింది. కొల్లాపూర్‌ నియోజవ ర్గంలోని మల్లేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు చేపల దళా రులు దశాబ్దాలుగా ఇక్కడి సంపదను దోచుకెళ్తున్నారు. ప్రతి సంపత్సరం మాదిరగా ఈసారి కూడా  కృష్ణానదిలో అలివి వ లల ద్వారా చేప గుడ్డు నుంచి పట్టి సొమ్ము చేసుకునేందుకు సి ద్ధమయ్యారు. ఇందు కోసం ఆంధ్ర జాలర్లతో రూ.65 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. వీరికి దాదాపు రూ.12 లక్షల దాకా బయాన కూడా ఇచ్చారు.

ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ఈ దందాకు మొదటి సారి స మస్య వచ్చింది. ఇన్ని సంపత్సరాలు అక్రమ దందాకు సహకా రం అందిస్తున్న రాజకీయ నాయకులు, అధికారుల్లో మార్పు వ చ్చింది. బయాన ఇచ్చిన ఆంధ్ర జాలర్లు నదిలో చేపల వేటను కొనసాగించాలంటే స్థానిక ప్రజాప్రతినిధి అనుమతిని తప్పనిస రిగా తీసుకోవాలి. ఈ విషయంపై దళారులు మల్లేశ్వరం గ్రా మస్థులతో కలిసి ఇటీవల కొల్లాపూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతిని ధిని కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. దందాకు సహకరిస్తే వ చ్చే ఎన్నికల్లో మా సహకారం మీకు ఉంటుందని మాఫియా చె ప్పినట్లు సమాచారం. కానీ, ఇందుకు ఆ ప్రజాప్రతినిధి నో చెప్పి నట్లు తెలిసింది. అలాగే, అలివి వలల ద్వారా చేపల వేటను కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.


వృద్ధి చెందక ముందే..

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. చెరువులు, కుంట లు, రిజర్వాయర్లు, నదుల్లో చేప పిల్లలను విడుదలో చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం కృష్ణా తీరంలో ఇప్పటి వరకు దా దా టపు రూ.30 లక్షలు ఖర్చు చేసి, దాదాపు 25 లక్షల చేప పి ల్లలను విడుదల చేసింది. విడుదల చేసిన చేప పిల్లలలో 80 శాతం వరకు వృద్ధి చెందాయి. దాదాపు 15 లక్షల నుంచి 20 ల క్షల  కిలోల వరకు ఉత్పత్తి రావ్వొచ్చని అంచనా ఉంది. కానీ, చే ప పిల్లలు వృద్ధి చెందక ముందే మత్స్య మాఫీయా నిషేధిత అ లివి వలలతో చేప గుడ్డుతో సహా బయటకు లాగుతున్నారు. ఒ క్క మల్లేశ్వరం గ్రామంలోనే 20 పట్లకు ఆంధ్ర జాలర్లతో ఒప్పం దం చేసుకున్నారు. ఒక పట్టు లాగితే దాదాపు వంద టన్నుల చేప పిల్లలు బయటకు వస్తాయి. ఒక పట్టుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు షికారి జరుగుతుంది. ఇంత జరుగు తున్నా ఎవరూ పట్టించుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.

Updated Date - 2020-12-31T03:37:16+05:30 IST