చేప మాంసం ఆరోగ్యకరం

ABN , First Publish Date - 2020-11-22T03:39:16+05:30 IST

మాంసాహారాల్లో చేప మాంసం ఆరోగ్యకరమైందని జిల్లా మత్స్యశాఖాధికారి డి.రాధారోహిణి అన్నారు.

చేప మాంసం ఆరోగ్యకరం
ప్రపంచ మత్స్యదినోత్సవ సదస్సులో మాట్లాడుతున్న ఏడీఎఫ్‌ డి.రాధారోహిణి

జిల్లా మత్స్యశాఖాధికారి డి.రాధారోహిణి


పాలమూరు, నవంబరు 21: మాంసాహారాల్లో చేప మాంసం ఆరోగ్యకరమైందని జిల్లా మత్స్యశాఖాధికారి డి.రాధారోహిణి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకుడు ఎం.సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మత్స్యకారులకు ఏర్పా టు చేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు అభివృద్ధి చెందాలనే ఉద్దే శం తో టూవీలర్స్‌, ఆటోలు, ఇతరత్ర వాహనాలు సబ్సిడీపై అందజేసినట్లు తెలిపారు. మత్స్య కారుల నుంచి చేపలు తీసుకొని ఇతర చోట్ల అమ్మడంతో దళారులు లాభం పొందే విధా నానికి స్వస్తి పలికి మత్స్యకారులే ఆదాయం పొందేందుకు ప్రభుత్వం ప్రణాళికను అమ లు చేస్తోందన్నారు. మత్స్యకారులే చేపలు నేరుగా పట్టుకోవడం, అమ్ముకోవడం, మార్కె ట్‌ చేసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తిని ఏవిధంగా చేస్తున్నారో పరిశీలించి ఆ విధానాన్ని పాటిం చాలన్నారు. చేపల ఉత్పత్తిని పెంచడంతోనే అందరు ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. కార్యక్రమంలో అధికారులు గంగారాం, మహేశ్వరరెడ్డి, టి.మదన్‌మోహన్‌, వీరేశం, నవీన్‌, రాందాసు, పాపయ్య, యాదయ్య, ఎర్రబాలప్ప, వెంకటన్న  పాల్గొన్నారు. 

Read more