ఎంబీబీఎస్‌ విద్యార్థినికి చేయూత

ABN , First Publish Date - 2020-12-14T03:30:27+05:30 IST

మండల పరిధిలోని వొడ్డుకింది తండాకు చెందిన రాధిక అనే అమ్మాయి నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వ కోటాలో హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించింది.

ఎంబీబీఎస్‌ విద్యార్థినికి చేయూత

కోస్గి, డిసెంబరు 13 : మండల పరిధిలోని వొడ్డుకింది తండాకు చెందిన రాధిక అనే అమ్మాయి నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వ కోటాలో హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించింది. ఈ క్రమంలో ఆదివారం కోస్గి పట్టణంలో హరివిల్లు ఫౌండేషన్‌ స భ్యులు రాధికకు రూ.20వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యు లు వెంకటేష్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి నిరుపేద అమ్మాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి గాంధీమెడికల్‌ కళాశాలలో సీటు సాధించడం పట్ల ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిందన్నారు. ఆమె మెడిసిన్‌ చదివేక్రమంలో పుస్తకాల కొనుగోలుకు ఫౌండేషన్‌ తరపున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు మురహరినాథ్‌, గోపాల్‌, ప్రశాంత్‌, వెంకటయ్యగౌడ్‌, కౌన్సిలర్‌ భానునాయక్‌, తుడుం శ్రీనివాస్‌, మైపాల్‌, బాలాజీ, ఎన్‌.నర్సిములు తదితరులు పాల్గ్గొన్నారు.

Updated Date - 2020-12-14T03:30:27+05:30 IST