రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-06-26T10:53:02+05:30 IST

జిల్లాలో నిర్మించతలపెట్టిన 88 రైతు వేదికల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు.

రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్మించతలపెట్టిన 88 రైతు వేదికల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. గురువారం ఆయన ఇంజనీరింగ్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతువేదికల నిర్మాణాల కోసం ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డీఏవో సుచరిత, డీఆర్‌డీవో వెంకటరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-26T10:53:02+05:30 IST