రైతులు ప్రభుత్వం మెడలు వంచడం ఖాయం

ABN , First Publish Date - 2020-12-16T04:21:15+05:30 IST

దేశంలోని రైతాం గం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచటం ఖాయమ ని ప్రముఖ విద్యావేత్త జలజం సత్యనారాయణ అన్నారు.

రైతులు ప్రభుత్వం మెడలు వంచడం ఖాయం
రైతులకు మద్దతుగా దీక్ష చేస్తున్న సీఐటీయూ నాయకులు

పాలమూరు, డిసెంబరు 15: దేశంలోని రైతాం గం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచటం ఖాయమ ని ప్రముఖ విద్యావేత్త జలజం సత్యనారాయణ అన్నారు. మంగళవారం రైతాంగం చేపట్టిన ఉద్య మానికి మద్దతుగా జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సీఐటీయూ నిరసన చేపట్టడం మంచిదన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగనివిధంగా రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. బేషరతుగా చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ ఫాసిస్టు విధానా లను ప్రతి ఒక్కరే ఖండించాలని మైనారిటీల మేధా వి ఎం.డి గులాంహుస్సేన్‌ అన్నారు. రైతాంగాన్ని దివాళా తీయించేవిధంగా ఉన్న వ్యవసాయ చట్టాల ను ఉపసంహరించుకోవాలని క్రిస్టియన్‌ ఫోరం నాయకులు సుందర్‌పాల్‌ అన్నారు. బీజేపీ కార్పొరే ట్‌ బుద్ధి బయటపడిందని ఈద్గా కమిటీ చైర్మన్‌ నూరుల్‌హసన్‌ అన్నారు. రైతాంగానికి దేశ ప్రజలం తా మద్దతుగా నిలబడ్డారని సీపీఎం రాష్ట్ర నాయకు డు కిల్లెగోపాల్‌ అన్నారు. దీక్షలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.కురుమూర్తి, బి.చంద్రకాంత్‌, మైనార్టి సెల్‌ సమద్‌ఖాన్‌, అలీ, ప్రశాంత్‌, భరత్‌, ఆవాజ్‌ కమిటీ కన్వీనర్‌ ఖయ్యూమ్‌, యాదమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ, అండాలు, వెంకటమ్మ, బీమమ్మ, చెన్నయ్య, వి.గాలెన్న, వెంకటేష్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:21:15+05:30 IST